kanneerelammaa… karuninchu yesu ninnu viduvabodammaaకన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పె (2) యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా|| నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన పరిచారా తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా (2) ||కన్నీరేలమ్మా|| నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2) ||కన్నీరేలమ్మా||